అక్షరటుడే, వెబ్‌డెస్క్: Baahubali : భారతీయ సినీ Indian cinema చరిత్రను తిరగనాసిన ‘బాహుబలి’ Baahubali చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే, ఈసారి ప్రేక్షకులకి సరికొత్త అనుభవాన్ని అందించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు.
అక్టోబరు 31, 2025న ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ ‘Baahubali: The Epic’ పేరుతో భారీగా రీ-రిలీజ్ చేయనున్నారు. ‘బాహుబలి 1’ నిడివి చాలా ఎక్కువ. ఇది – 2 గంటల 38 నిమిషాల లెంగ్తీతో ఉంటుంది. ఇక ‘బాహుబలి 2’ నిడివి – 2 గంటల 31 నిమిషాలు ఉంది. ఈ రెండు కలిపితే 5 గంటలకు పైగా వస్తుంది. కానీ మేకర్స్ అనవసర సన్నివేశాలు, పాటలు తొలగించి 3.5 గంటల కట్ రెడీ చేశారు. ఇందులో కొన్ని డిలీటెడ్ సీన్లు కూడా జత చేశారు. వాటి వల్ల కొత్త అనుభూతి కలగనుంది.
Baahubali : సరికొత్త ప్లాన్..
ఈ ఎడిషన్‌ను పూర్తిగా ఒకే కథనంలా నడిపించేందుకు మేకర్స్ స్క్రీన్‌ప్లేలో చిన్న మార్పులు చేశారు. ఇంటర్వెల్ వద్ద ‘బాహుబలి 1’ ముగుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ‘బాహుబలి 2’ Baahubali 2 ప్రారంభమవుతుంది. డైరెక్టర్ రాజమౌళి Director Rajamoul సృజనాత్మకత మరోసారి ప్రేక్షకులని అలరించేలా ఉంటుంది.
రీరిలీజ్ కాబోతున్న చిత్రంలో కట్ చేసిన సీన్లు మళ్ళీ జత చేయబోతున్నారు. దాంతో సినిమాకు మళ్ళీ సెన్సార్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలోనే ఈ వర్షన్ సెన్సార్ బోర్డుకు వెళ్తుంది. ‘బాహుబలి 1 & 2’ కలిపి రూ.2400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఈ రీ-రిలీజ్ వర్షన్ రూ.40 నుంచి రూ.50 కోట్ల వరకు కలెక్షన్లు సాధించగలదని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
రీ రిలీజ్ కోసం మొత్తం 4 గంటల లెంగ్త్‌తో ఫైనల్ కట్ రెడీ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే చాలా సార్లు సినిమా చూసిన ప్రేక్షకులకి ఆసక్తి కలిగేలా ఎడిటింగ్‌లో లేపేసిన డిలీటెడ్ సీన్స్ Deleted scenes రీ-రిలీజ్ వర్షన్‌లో జత చేయబోతున్నారు. ఇలా డిలీట్ చేసిన సీన్స్‌ని మళ్లీ జత చేస్తే, సెన్సార్ చేయడం కూడా తప్పనిసరి అవుతుంది.
అయితే, రీ రిలీజ్‌లో బాహుబలి ది ఎపిక్ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటివరకు రీ-రిలీజ్‌లలో సనమ్ తేరీ కసమ్ – ₹41 కోట్లుకి పైగా వసూళ్లు రాబట్టగా, తుంబాద్ – ₹38 కోట్లు+, మహేష్ బాబు Mahesh Babu ‘మురారి’ Murari – ₹10 కోట్లు+, ‘ఖలేజా’ Khaleja– ₹9 కోట్లు+ వసూళ్లు రాబట్టాయి. ఇవన్నింటిని ‘బాహుబలి: ది ఎపిక్’ తుడిచిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
