IPL 2025
IPL 2025

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2025 | స‌మ్మ‌ర్​లో క్రికెట్ (cricket) ప్రియుల‌ను ఎంత‌గానో ఉత్సాహ‌ప‌రిచే టోర్న‌మెంట్ ఐపీఎల్ IPL. ప్రతి సంవ‌త్స‌రం ఈ టోర్నీ (tournament) సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. అయితే పాక్​తో యుద్ధం, ఉద్రిక్త‌త‌ల‌ నేప‌థ్యంలో ఐపీఎల్ 2025 ఆగిపోయింది. ధ‌ర్మ‌శాల‌లో (Dharamsala) జ‌రుగుతున్న మ్యాచ్‌ను అర్థాంత‌రంగా ఆపేసి, ఆట‌గాళ్ల ర‌క్ష‌ణే త‌మ ధ్యేయ‌మ‌ని బీసీసీఐ (BCCI) చాటి చెప్పింది. ‘వాయిదా’ అనే మాట విన‌గానే విదేశీ ఆట‌గాళ్లు త‌మ దేశాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఇప్పుడు ఉద్రిక్త‌త త‌గ్గింది. కాల్పుల విర‌మ‌ణ‌కు ఇరు దేశాలూ అంగీక‌రించాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే 16వ తేదీన ఐపీఎల్ తిరిగి ప్రారంభం (IPL restart) కానుంది. కొన్ని రోజులపాటు మ్యాచ్‌లు నిర్వహించలేదు. దాంతో ఆ సమయాన్ని, తేదీలను భర్తీ చేయడానికి బీసీసీఐ (BCCI), ఐపీఎల్ (IPL)పాలకమండలి మరో నిర్ణయం తీసుకుంటోంది.

IPL 2025 | ఈ రోజు తేలుతుందా?

IPL షెడ్యూల్‌లో (IPL schedule) డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహణతో ఇటీవల వారం రోజులు నిలిపివేసిన మ్యాచులను ఒకేరోజు రెండు మ్యాచ్‌ల నిర్వహణతో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. మే 25 నుంచి మే 30 లోపు ఐపీఎల్ సీజన్ (IPL season) ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ. IPL పూర్తయిన వెంటనే టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు (india-england test series in england) వెళ్లనుంది. IPL 2025లో ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. PBKS vs DC మ్యాచ్ 58వ మ్యాచ్ జరుగుతుండగా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పుడు, 12 లీగ్-స్టేజ్ మ్యాచ్‌లు, 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు పెండింగ్‌ (play-off matches on pending) ఉన్నాయి.

మొదట్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లను నిర్వహించడానికి హైదరాబాద్, కోల్‌కతా వేదికలు (hyderabad and kolkata venues) షెడ్యూల్ చేశారు. హైదరాబాద్‌లో క్వాలిఫైయర్–1తో పాటు ఎలిమినేటర్, కోల్‌కతాలో క్వాలిఫైయర్–2 సహా ఐపీఎల్ ఫైనల్ (IPL final match) నిర్వహించనున్నారు. ఇటీవల పాక్‌తో ఉద్రిక్తతల కారణంగా, BCCI మిగిలిన మ్యాచ్‌లను దక్షిణ భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు వేదికలను (chennai, banglore and hyderabad venues) మార్చాలని పరిశీలిస్తోంది. ఆదివారం (మే 11) IPL 2025 పునఃప్రారంభంపై బీసీసీఐ, ఐపీఎల్ (BCCI and IPL) పాలక మండలి తుది నిర్ణయం తీసుకోనున్నాయని స‌మాచారం. మ‌ళ్లీ ఐపీఎల్ మొద‌లైతే ఇక క్రికెట్ ప్రేమికుల‌కు (cricket lovers) పండుగే పండుగ‌.