అక్షరటుడే, ఇందూరు : MP Arvind | దేశ సైనికులు ఆరోగ్యంగా ఉండాలని, యుద్ధంలో మృతి చెందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Arvind అన్నారు. మనం సైతం దేశం కోసం కార్యక్రమంలో భాగంగా ఆదివారం సారంగాపూర్ హనుమాన్ ఆలయం sarangapoor hanuman temple లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇరుదేశాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని కోరుతున్నానన్నారు. శాంతి అందరికీ కావాలని, అందుకే కాల్పుల విరమణ(cease fire) ఒప్పందం కుదిరిందన్నారు. దేశభద్రత తదితర కారణాలతో కేంద్రం, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. త్వరలో అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
