ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​EAPCET | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

    EAPCET | ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : EAPCET | తెలంగాణ ఈఏపీసెట్​ EAPCET ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్​, ఫార్మసీ ఎంట్రెన్స్​ కోసం ఏప్రిల్​ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్​ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్​ పెట్టారు. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్​లైన్​) విధానంలో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ క్రమంలో ఫలితాలు విడుదల చేసిన సీఎం విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కులు జాబితాను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థుల సెల్​ఫోన్లకు నేరుగా ఫలితాలు పంపించారు. ఇంజినీరింగ్​ విభాగంలో 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు.

    EAPCET | టాప్​ ర్యాంకర్లు వీరే..

    ఇంజినీరింగ్ విభాగంలో ఏపీలోని మన్యం జిల్లా పార్వతీ పురానికి చెందిన పల్లా భరత్ చంద్ర ఫస్ట్​ర్యాంక్​ సాధించాడు. రంగారెడ్డి జిల్లా శేరిలింగం పల్లికి చెందిన ఉడగండ్ల రామ్​చరణ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచాడు. ఏపీలోని విజయనగరం జిల్లా పమ్మిన హేమ సాయి సూర్య కార్తిక్ మూడో ర్యాంక్​ సాధించాడు. అగ్రికల్చర్ విభాగంలో మేడ్చల్​కు చెందిన సాకేత్ రెడ్డి ఫస్ట్​ ర్యాంక్​, కరీంనగర్​కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్యా సెకండ్​ ర్యాంక్, వరంగల్​కు చెందిన చంద్ర అక్షిత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు.

    More like this

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. రిజర్వేషన్ల పెంపునకు గవర్నర్​ ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్​డేట్​ వచ్చింది. బీసీ...

    Sriram Sagar | శ్రీరాంసాగర్ వరద గేట్ల మూసివేత

    అక్షరటుడే, బాల్కొండ: Sriram Sagar | తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి (Sriram Sagar Project) వరద తగ్గుముఖం...

    Yellareddy | చెరువు బాగు కోసం రైతులంతా ఏకమయ్యారు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు తమ చెరువును...