ePaper
More
    HomeజాతీయంLIC | ఇక వాట్సాప్‌లోనూ ఎల్‌ఐసీ సేవలు

    LIC | ఇక వాట్సాప్‌లోనూ ఎల్‌ఐసీ సేవలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: LIC | పాలసీదారుల (Policy holders) కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) మరో సౌలభ్యాన్ని తీసుకువచ్చింది. సులభంగా ప్రీమియం (Premium) చెల్లించేందుకోసం, పాలసీ వివరాలు తెలుసుకునేందుకోసం వాట్సాప్‌ నంబరు (89768 62090) ను కేటాయించింది. అయితే ఇది ఎల్‌ఐసీ పోర్టల్‌లో (LIC portal) వివరాలు నమోదు చేసుకున్న పాలసీదారులకు (Policy holders) మాత్రమే అందుబాటులో ఉంటుంది.

    ఎల్‌ఐసీ పోర్టల్‌(LIC portal)లో నమోదు చేసుకున్న పాలసీదారులు ముందుగా 89768 62090 నంబర్ కు హాయ్‌(Hi) అని మెస్సేజ్‌ (Message)పంపిస్తే ఎల్‌ఐసీ సర్వీసెస్‌కు (LIC services) సంబంధించిన సమాచారం వస్తుంది. దానిలో 15 ఆప్షన్స్‌ ఉంటాయి. దీని ద్వారా ప్రీమియం చెల్లింపు (premium payment), బోనస్‌ ఇన్ఫర్మేషన్‌ (bonus information), పాలసీ స్టేటస్‌ (policy status) తదితర వివరాలను తెలుసుకోవచ్చు. నేరుగా యూపీఐ (UPI), నెట్‌ బ్యాంకింగ్ (net banking), కార్డుల ద్వారా వాట్సాప్‌ బాట్‌లోనే ప్రీమియం చెల్లింపులు పూర్తి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రీమియం చెల్లించిన తర్వాత రశీదు(receipt) కూడా వాట్సాప్‌ ద్వారానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పాలసీదారులు (policy holders) ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా ప్రీమియం చెల్లించేందుకు (premium payment) ఇది సౌకర్యంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...