- Advertisement -
HomeతెలంగాణMiss World competitions | మూడెంచ‌ల భ‌ద్ర‌త మ‌ధ్య ప్రారంభ‌మైన మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. పూర్తి...

Miss World competitions | మూడెంచ‌ల భ‌ద్ర‌త మ‌ధ్య ప్రారంభ‌మైన మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miss World competitions | మిస్ వ‌రల్డ్ పోటీల‌కు హైద‌రాబాద్ వేదికైంది. నేటి నుండి మిస్ వ‌ర‌ల్డ్ పోటీలు జ‌ర‌గ‌నుండ‌గా, దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల నడుమ పటిష్ట భద్రతా పరమైన చర్యలు చేపట్టింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు.. 22 రోజుల పాటు ఈ అందాల పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం Indoor Stadium లో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 72వ మిస్ వరల్డ్ పోటీల కోసం దాదాపు 110 దేశాల ప్రతినిధులు ఇప్పటికే నగరానికి చేరుకుని రిహార్సల్స్ పూర్తి చేయగా, మన దేశానికి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి హాజరై శనివారం రాత్రి పోటీలను ప్రారంభించారు.

Miss World competitions | అంగ‌రంగ వైభ‌వంగా..

ఈ కార్య‌క్ర‌మానికి వెయ్యి మందికి పైగా అతిథులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ మిస్ వరల్డ్ పోటీలను చూసేందుకు హాజరుకానున్నారు. 350 మంది పైగా కళాకారులు, దాదాపు రెండు గంటల పాటు చేసే విన్యాసాలు, కళా ప్రదర్శనలతో మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవం అలరించనుంది. మిస్ వరల్డ్ Miss World చరిత్రలో మొదటి సారి మన దేశం వరుసగా రెండు సంవత్సరాలు పోటీలను నిర్వహించడం ప్రత్యేకతగా చెప్పుకోవ‌చ్చు. గ‌చ్చిబౌలి స్టేడియంలో జ‌య‌జయ‌హే తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాప‌న‌తో పోటీలు మొద‌ల‌య్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలు ఉట్టిప‌డేలా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌గా, ఇవి అల‌రించాయి.

- Advertisement -

250 మంది క‌ళాకారుల‌తో పేరిణి నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో భాగంగా పోటీ దారులు విభిన్న వ‌స్త్ర‌దార‌ణ‌లో క‌నిపించి అల‌రించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, డీజీపీ జితేంద‌ర్, తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఛైర్మన్ ప‌టేల్ ర‌మేశ్ రెడ్డి Ramesh Reddy, న‌గ‌ర మేయ‌ర్ విజ‌య ల‌క్ష్మీ, మిస్ వ‌ర‌ల్డ్ సీఈఓ జూలియా మోర్లే, మిస్ వ‌ర‌ల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా త‌దిత‌రులు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సాంస్కృతిక, సామాజిక ప్రయోజనాల మేళవింపుగా, మూడు వారాల పాటు మిస్ వరల్డ్ వేడుకలు అట్ట‌హాసంగా జరుగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీదారులు రాష్ట్రంలోని వరంగల్, పోచంపల్లి, బుద్ధవనం, యాదగిరిగుట్ట, మహబూబ్‌నగర్ ప్రాంతాల సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ నెల 13న చార్మినార్, లాడ్ బజార్ దగ్గర హెరిటేజ్ వాక్ జరుగుతుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News