CBI Raids | రూ.70 లక్షల లంచం డిమాండ్​.. ఐటీ కమిషనర్​ అరెస్ట్​
CBI Raids | రూ.70 లక్షల లంచం డిమాండ్​.. ఐటీ కమిషనర్​ అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Raids | నిత్యం ఏసీబీ acb, సీబీఐ cbi దాడులు చేస్తున్నా అవినీతి అధికారుల్లో corrupted officials మార్పు రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది లంచాలు తీసుకోనిదే పనులు చేయడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో రైతులు, పేదలను సైతం కొందరు అధికారులు లంచాల పేరిట వేధిస్తున్నారు. ఎంతొస్తే అంత అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రూ.500, రూ.వెయ్యి కూడా ఇవ్వమని అడుగుతున్నారు. మరికొందరేమో రూ.లక్షల్లో లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా ఇలా రూ.70 లక్షల లంచం డిమాండ్​ చేసిన ఓ అధికారిని సీబీఐ అరెస్ట్ చేసింది.

CBI Raids | ఫైళ్లను పెండింగ్​లో పెట్టి..

హైదరాబాద్​ Hyderabadలో ఆదాయ పన్ను కమిషనర్​గా income tax commissioner పనిచేసే వ్యక్తిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆయనతో పాటు మరో 14 మందిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. సదరు కమిషనర్​ తన వద్ద ఫైళ్లను పెండింగ్​లో పెట్టుకొని వాటికి క్లియరెన్స్​ ఇవ్వడానికి లంచం తీసుకుంటున్నట్లు సీబీఐ గుర్తించింది. లంచం తీసుకొని పలువురి అక్రమంగా పనులు చేసి పెట్టినట్లు తేల్చింది. ఈ క్రమంలో సీబీఐ వల పన్ని నిందితుడిని పట్టుకుంది. ఓ వ్యక్తి నుంచి రూ.70 లక్షల లంచం తీసుకుంటుండగా శనివారం సీబీఐ అధికారులు నిందితుడు పంపిన మధ్యవర్తిని పట్టుకున్నారు. కమిషనర్​, మధ్యవర్తితో పాటు కమిషనర్​ సహచరులు సహా 15 మందిని సీబీఐ అరెస్ట్​ చేసింది.

CBI Raids | 18 చోట్ల తనిఖీలు

ప్రధాన నిందితుడైన కమిషనర్​ను ముంబయిలో అరెస్ట్​ చేసింది. ముంబయి, హైదరాబాద్​, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో సీబీఐ తనిఖీలు చేపట్టింది. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచామన్నారు.