అక్షరటుడే, వెబ్‌డెస్క్: IQOO Neo 10 5G | చైనా(China)కు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ భారత మార్కెట్‌లోకి మరో మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను (5G smart phone) తీసుకువస్తోంది. ఈనెల 26 న లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 6100 ఎంఏహెచ్ బ్యాటరీ (6100 MAH battery) సామర్థ్యంతో వస్తున్న IQOO Neo 10 5G మోడల్ ధర రూ. 35 వేలవరకు ఉండొచ్చని తెలుస్తోంది. అమెజాన్‌తో పాటు ఐక్యూ వెబ్‌సైట్‌లో (IQOO web site) అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా..
- డిస్‌ప్లే : 6.78 ఇంచ్ LTPO అమోలెడ్ డిస్‌ప్లే. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్. 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్.
- ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8s gen 4 ప్రాసెసర్.
- ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 15.
- కెమెరా: వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ వైడ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా.
- IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్.
- బ్యాటరీ సామర్థ్యం : 6100 mAh. 120 వాట్స్ అల్ట్రా చార్జింగ్ సపోర్ట్. 15 నిమిషాల్లోనే జీరో నుంచి 50 శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
IQOO Neo 10 5G | వేరియంట్స్..
మూడు వేరియంట్‌లలో ఈ ఫోన్ లభించే అవకాశాలున్నాయి.
- 12 జీబీ RAM + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 12 జీబీ RAM + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 16 జీబీ RAM + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్