ePaper
More
    HomeజాతీయంPIB Fact Check | ఫేక్‌ న్యూస్‌లో పాక్‌ మాస్టర్‌ డిగ్రీ.. తప్పుడు ప్రచారాన్ని దీటుగా...

    PIB Fact Check | ఫేక్‌ న్యూస్‌లో పాక్‌ మాస్టర్‌ డిగ్రీ.. తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొడుతున్న పీఐబీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PIB Fact Check | జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో(operation sindoor) పాక్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. భారత్‌(Bharath)కు దీటైన జవాబిచ్చే పరిస్థితిలో లేని పాక్‌.. సొంత ప్రజలను సమాధాన పరిచేందుకు తప్పుడు ప్రచారాన్నే అస్త్రంగా మార్చుకుంది. ఫేక్‌ న్యూస్‌(Fake news)ను ప్రచారం చేయడంలో మాస్టర్‌ డిగ్రీ చేసిన పాకిస్థాన్‌ (pakistan).. భారత్‌పై పైచేయి సాధించినట్లు చెప్పుకోవడానికి నానా గడ్డి కరుస్తోంది.

    పాకిస్థాన్‌ సైబర్‌ దాడితో భారత్‌కు చెందిన పవర్‌గ్రిడ్‌లు 70 శాతం దెబ్బతిన్నాయంటూ శనివారం ఆ దేశానికి చెందిన స్ట్రాటజిక్‌ అనలిస్ట్‌ కమర్‌ చీమా సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టు (fake news on social media) పెట్టాడు. దీనిని మన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) చీల్చి చెండాడింది. ఫ్యాక్ట్‌ చెక్‌(Fact check) చేసి తప్పుడు ప్రచారమని నిరూపించింది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని ఎయిర్‌బేస్‌పై పాకిస్థాన్‌ దాడులు (pakistan attacks on jammu and kashmir air bases) చేసినట్లు సోషల్‌ మీడియా(Social media)లో వైరల్‌ అయిన వీడియోలు.. 2021లో అఫ్ఘనిస్థాన్‌లోని (afghnistan) కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన పేలుడు తాలూకావని ఫ్యాక్ట్‌ చెక్‌తో రుజువు చేసింది.

    అమృత్‌సర్‌లోని సైనిక స్థావరంపై దాడులు (amritsar army camps attacks) చేసినట్లు పాకిస్థాన్‌ షేర్‌ చేసిన వీడియో (pakistan shared Video) కూడా ఫేక్‌దని (fake) పీఐబీ తేల్చింది. జలంధర్‌పై డ్రోన్‌ దాడి చేసినట్లుగా పాక్ చెప్పుకుంటున్న వార్తలోనూ నిజం లేదని, అది అగ్ని ప్రమాదానికి సంబంధించినదని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(Press Information Buerau) నిరూపించింది. గుజరాత్‌లోని పోర్ట్‌పై దాడి చేశామని, పలువురు భారత సైనికులు హతమయ్యారని పాకిస్థాన్‌ అల్లిన కథనాన్ని కూడా పీఐబీ(PIB) ఫ్యాక్ట్‌ చెక్‌తో తూర్పారబట్టింది. గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌పై దాడి చేసినట్లు పాక్‌ వైరల్‌ చేసిన వీడియో 2021లో జరిగిన ఆయిల్‌ ట్యాంకర్‌ పేలుడుకు సంబంధించినదని నిరూపించింది.

    భారత్‌ ప్రయోగించిన యూఏవీ డ్రోన్‌ను గుజ్రన్‌వాలాలో పాక్‌ ఆర్మీ (pakistan army) కూల్చివేసినట్లు వైరల్‌ అయిన వీడియో నకిలీదని (fake video viral) తేల్చింది. ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు మూడు రోజులపాటు ఏటీఎంలను మూసి ఉంచుతారంటూ వాట్సాప్‌లో జరుగుతున్న ప్రచారమూ తప్పని తేలింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్‌లలోకు ప్రజల ప్రవేశాన్ని నిషేధించినట్లుగా సోషల్‌ మీడియాలో (social media) వస్తున్న వార్తలలోనూ నిజం లేదని తేల్చింది. ఇలా పాక్‌ ప్రయోగిస్తున్న తప్పుడు ప్రచారాస్త్రాలను మన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (Press Information Bureau) ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్‌ చెక్‌తో తుత్తునియలు చేస్తూ ప్రజలలో ఆందోళనలను నివారించే ప్రయత్నం చేస్తోంది.

    More like this

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...

    Moneylaundering Case | మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. అక్ర‌మ ఖ‌నిజం త‌ర‌లింపు కేసులో..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moneylaundering Case | క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ బుధ‌వారం...

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...