అక్షరటుడే, నిజాంసాగర్: Mission Bhagiratha leakage | ఓ వైపు మండే ఎండలతో తాగునీటి కోసం తండావాసులు అవస్థలు పడుతుంటే.. మరోవైపు పైప్లైన్ల లీకేజీ(Pipelines Leakage)ల కారణంగా మిషన్ భగీరథ నీళ్లు(Mission Bhagiratha water) వృథా అవుతున్నాయి. మండలంలోని మంగ్లూర్ శివారులోని ఆయిల్ మిల్ సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ లీకేజీ అవుతోంది. లీకేజీ అయిన నీళ్లు చెరువును తలపిస్తోన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
