అక్షరటుడే, నిజాంసాగర్: Drinking water problem | పెద్దకొడప్గల్ మండలంలోని రతన్‌సింగ్ తండా(Ratan Singh Thanda)లో తాగునీటి కోసం తండావాసులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీటి సరఫరా అరకొరగా సాగుతోంది. దీంతో మండుటెండలో ఇతర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలోని ఆలయం వద్ద బోరుబావిని ఆశ్రయిస్తున్నారు. అయితే శనివారం విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ఎండలో తాగునీటి(Drinking Water) కోసం గంటల తరబడి వేడి ఉండాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. తండాలో తాగునీటి సమస్య తీర్చాలని వారు కోరుతున్నారు.
