ePaper
More
    Homeక్రీడలుBCCI | IPL 2025 వాయిదా.. బీసీసీఐకి భారీ నష్టం!

    BCCI | IPL 2025 వాయిదా.. బీసీసీఐకి భారీ నష్టం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BCCI | భారత్-పాకిస్థాన్ (india-pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా (IPL 2025 season postpone) పడింది. వారం రోజుల పాటు ఐపీఎల్ 2025 సీజన్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్స్, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా (BCCI secretary devjit saikia) శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

    ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా (IPL 2025 season postponed) పడటం బీసీసీఐకి భారీ నష్టం (BCCI huge lose) వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. టోర్నీ (tournament) మళ్లీ జరిగితే మాత్రం ఈ నష్టం చాలా వరకు తగ్గుతుంది. అలా కాకుండా పూర్తిగా రద్దయితే మాత్రం బీసీసీఐ (BCCI) ఒక్కో మ్యాచ్‌కు రూ. 125 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన 16 మ్యాచ్‌లు(12 లీగ్+ 4 ప్లే ఆఫ్) పూర్తిగా రద్దయితే సుమారు రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది.

    బీసీసీఐ ప్రధాన ఆదాయం ప్రసార హక్కుల (broadcasting rights) నుంచి లభిస్తుంది. ఒక్కో మ్యాచ్‌కు ప్రసారకర్తల నుంచి బీసీసీకి రూ. 100 కోట్ల నుంచి 125 కోట్ల ఆదాయం వస్తుంది. బ్రాడ్‌కాస్టర్స్ (broadcasters) కాకుండా స్పాన్సర్‌షిప్ (sponsorship) ద్వారా కూడా బీసీసీఐ కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. టైటిల్ స్పాన్సర్స్, అసోసియేట్ స్పాన్సర్స్‌ (titel sponsers and associate sponsors) బీసీసీఐకి భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. మ్యాచ్‌లు రద్దయితే స్పాన్సర్స్ నుంచి వచ్చే ఆదాయంలో కోత పడనుంది.

    మ్యాచ్‌ల టికెట్ల (match tickets) ద్వారా వచ్చే ఆదాయం కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు (play-off matches) ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలో ఇతర మార్గాల ద్వారా బీసీసీఐకి భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. మ్యాచ్‌లు నిర్వహించకపోతే.. ఐపీఎల్ (IPL) అనుబంధ పరిశ్రమలపై కూడా ప్రభావం పడుతుంది. ఐపీఎల్ వల్ల స్టేడియంల వద్ద వ్యాపారాలు, రవాణా, హోటళ్లు వంటి అనేక అనుబంధ పరిశ్రమలు లబ్ధి పొందుతాయి. టోర్నీ (tournament) వాయిదా పడితే వాటిపై కూడా ప్రభావం పడుతుంది.

    ప్రస్తుతానికి టోర్నీ ఒక వారం పాటు మాత్రమే వాయిదా పడింది. పరిస్థితులు మెరుగుపడితే టోర్నీని తిరిగి నిర్వహించే అవకాశం ఉంది. అలా జరిగితే పెద్దగా నష్టం ఉండదు. అయితే, ఒకవేళ టోర్నీ (tournament) పూర్తిగా రద్దయితే బీసీసీఐతో (BCCI) పాటు ఫ్రాంచైజీలు, ఇతర వాటాదారులకు కూడా భారీ నష్టం వాటిల్లుతుంది. టోర్నీ రద్దయితే అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ (broadcasters Jio Hotstar and Star Sports) సుమారు రూ.1800 కోట్ల ప్రకటన ఆదాయాన్ని కోల్పోనుంది.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...