అక్షరటుడే, బోధన్:Bodhan Government Hospital | పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి(Government Hospital) పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో రోగులు(Patients), వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం పట్టణానికి చెందిన గంగాధర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబీకులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వార్డ్బాయ్లు(Ward boys) అందుబాటులో లేక బాధిత బంధువులే అతడిని వీల్చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు. ఆస్పత్రిలో 12మంది వార్డ్బాయ్లు ఉండగా.. ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో బంధువులే వార్డ్బాయ్లు
Published on
