More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | మాజీ సీఎం జగన్​ సంచలన వ్యాఖ్యలు

    YS Jagan | మాజీ సీఎం జగన్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ jagan​ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన వైసీపీ పీఏసీ ycp pac సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్​ జగన్​ పార్టీ బలోపేతం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి sajjala కన్వీనర్​గా పొలిటికల్​ అడ్వైజరీ కమిటీ(pac)ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ మొదటి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఐపీఎస్​ ips ఆంజనేయులు అరెస్ట్​ను జగన్​ ఖండించారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు chandrababu కక్ష పెట్టుకొని మిథున్ రెడ్డి Mithun reddyని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.

    YS Jagan | ప్రజల తరఫున పోరాడాలి

    బూత్‌ లెవల్‌ కమిటీలు ఏర్పాటు చేసుకొని గ్రామస్థాయిలో కూడా పార్టీని తీసుకువెళ్లాలని జగన్​ సూచించారు. ప్రజల తరపున పోరాటాలు చేయాలని ఆదేశించారు. విశాఖ Vishakaలో రూ.3 వేల కోట్ల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కూటమి ప్రభుత్వం Kootami Govt కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని జగన్​ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరిస్తూ పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

    More like this

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...

    IOB Notification | ఐవోబీలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IOB Notification | స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(Specialist Officer) ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్‌ ఓవర్సీస్‌...

    Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా...