అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation sindoor | పాక్ దాడులు, భారత్ ప్రతిదాడులపై కేంద్రం శనివారం ఉదయం వివరాలు వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి(Foreign Secretary Vikram Misri), సోఫియా ఖురేషి(Sophia Qureshi), వ్యోమికా సింగ్ (Vyomika Singh) మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లో 26 చోట్ల దాడులతో రెచ్చిపోయిందని వారు తెలిపారు. పాక్ ఫైటర్ జెట్లు(Pak Fighter Jets) భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చినట్లు వారు వివరించారు. పంజాబ్‌లోని పలు ఎయిర్ బేబ్‌లను లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులకు తెగబడిందన్నారు.
operation sindoor | దాడులను తిప్పికొట్టాం
పాక్ యుద్ధ విమనాలు, డ్రోన్లు, లాంగ్ రేంజ్ మిసైల్స్‌తో దాడి చేస్తోందన్నారు. శ్రీనగర్ స్కూళ్లు(Srinagar schools), ఆస్పత్రులను(Srinagar Hospitals) లక్ష్యంగా దాడులు చేసినట్లు వివరించారు. రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లపై పాక్ దాడికి యత్నించిదన్నారు. అయితే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుందని వారు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని చెప్పారు.
Operation sindoor | పాక్ ఎయిర్‌బేస్‌పై దాడి
పాక్ దాడులపై భారత్ సంయమనంతో వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. అయితే దాడులను తిప్పికొడుతూనే పాకిస్తాన్ పంజాబ్‌లోని ఎయిర్‌బేస్ స్టేషన్(Airbase station)పై అర్ధరాత్రి భారీ దాడి చేశామన్నారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను(Ballistic missiles) వాడుతున్నట్లు తెలిపారు.
Operation sindoor | తప్పుడు ప్రచారం..
పాకిస్తాన్ సోషల్ మీడియాలో (pakistan social media) తప్పుడు ప్రచారం చేస్తోందని విక్రమ్ మిస్రీ తెలిపారు. మన గగనతల రక్షణ వ్యవస్థ S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ ప్రచారం చేసిందన్నారు. మన రక్షణ వ్యవస్థపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. అలాగే భారత ఎయిర్ బేస్‌లపై దాడులు చేసినట్లు దాయదీ దేశం ప్రచారం చేస్తోందని, మన ఎయిర్ బేస్‌లు సురక్షితంగా ఉన్నాయని వెల్లడించారు. అందుకు సంబంధించిన చిత్రాలను మీడియాకు విడుదల చేశారు.