ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | 96ఏళ్ల వృద్ధురాలితో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం.. ఆ బామ్మ...

    Pawan Kalyan | 96ఏళ్ల వృద్ధురాలితో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం.. ఆ బామ్మ చేసిన పనికి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pawan Kalyan | ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ Pawan Kalyan.. ఆయ‌న పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాల‌లో ఉన్న‌ప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. ఆయ‌న సినిమాలు ఫ్లాప్ అయిన‌, హిట్ అయిన కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇప్పుడు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ప‌వ‌న్ సినిమాలు త‌గ్గించాడు. అయిన కూడా ప‌వ‌న్ నిత్యం ఏదో ఒక విష‌యంతో సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌(Center of Attraction)గా మారుతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టి నుండి పవన్ కళ్యాణ్ ఏపీలో గ్రామాల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.. అయితే పవన్ ఓ బామ్మ చేసిన పనికి పొంగిపోయి ఆ బామ్మ అడిగిన కోరికను తీర్చాడు.

    Pawan Kalyan | ఇది క‌దా ప‌వ‌న్ అంటే..

    పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency), యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు అనే వృద్ధురాలు పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ మీద అభిమానంతో ఆయన ఎన్నికల్లో గెలవాలని, గెలిస్తే వేగులమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి, అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకుంది. పవన్ గెలవడంతో పోతుల పేరంటాలు Perantalu తన పింఛను సొమ్ము నుంచి రూ.2,500 చొప్పున పోగు చేసి రూ.27వేలతో గరగ చేయించి అమ్మవారికి సమర్పించారు. అయితే ఆమెకు తనతో కలిసి భోజనం చేయాలని ఉందని తెలియడంతో పవన్ కళ్యాణ్ ఆ బామ్మ‌ని త‌న క్యాంప్ కార్యాల‌యానికి(Camp Office) పిలిపించి ఆవిడ‌తో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ ఘటన పవన్ కల్యాణ్ అభిమానుల పట్ల చూపే ఆదరణకు నిదర్శనంగా నిలిచింది

    పవన్ చేసిన పనికి మరోసారి పవన్ ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది కదా పవన్ మంచితనం అని మెచ్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆ వృద్ధురాలిని పిలిపించి భోజనం పెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారాయి. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇటీవ‌ల హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు Harihara veeramallu సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావ‌ల్సి ఉన్నా ప‌వ‌న్ క‌మింట్ మెంట్స్ వ‌ల‌న లేట్ అయింది. జూన్‌లో చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...