More
    Homeఆంధ్రప్రదేశ్​AP Rajya Sabha | ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు అన్నామ‌లై..? స్మృతి ఇరానీ పేరు కూడా...

    AP Rajya Sabha | ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు అన్నామ‌లై..? స్మృతి ఇరానీ పేరు కూడా ప‌రిశీల‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: AP Rajya Sabha | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానంలో Rajya Sabha seat పోటీ చేసేందుకు బీజేపీ BJP సిద్ధ‌మైంది. త‌మిళనాడు బీజేపీ మాజీ అధ్య‌క్షుడు అన్నామ‌లై Tamil Nadu BJP ex president Annamalai లేదా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని former Union Minister Smriti Irani రంగంలోకి దించ‌నుంది. రాజ్య‌స‌భ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లో టీడీపీ బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని కూట‌మి వ‌ర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి YSRCP Rajya Sabha MP Vijayasai Reddy ఇటీవ‌ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఎన్నిక అనివార్య‌మైంది.

    జూన్ 2028 వ‌ర‌కు తన పదవీకాలం ఉన్న‌ప్ప‌టికీ, పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌తో ఆయ‌న రాజీనామా resigned చేశారు. క్రియాశీల‌క రాజ‌కీయాల active politics నుంచి త‌ప్పుకున్నారు. ఖాళీ అయిన ఈ స్థానానికి మే 9న తేదీన ఎన్నిక election జ‌రుగ‌నుంది. ఈ స్థానంలో పోటీ చేయాల‌ని భావిస్తున్న బీజేపీ bjp.. ఏపీలోని AP త‌న భాగ‌స్వామి అయిన టీడీపీ TDP మ‌ద్ద‌తు పొందిన‌ట్లు తెలిసింది. మే 9న జరగనున్న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ election notification ఇప్పటికే విడుదలైంది, ఏప్రిల్ 29 నామినేషన్లకు చివరి తేదీ.

    AP Rajya Sabha | అమిత్ షాతో బాబు భేటీ..

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Andhra Pradesh Chief Minister కేంద్ర హోంమంత్రి అమిత్ షాను Union Home Minister Amit Shah మంగ‌ళ‌వారం కలిశారు. రాజ్య‌స‌భ ఎన్నిక Rajya Sabha elections అంశంపై ఇరువురు చర్చించినట్లు రెండు పార్టీల నేత‌లు తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీలను ఏపీ అసెంబ్లీలో AP Assembly స్పష్టమైన మెజారిటీ ఉన్న టీడీపీ TDP కోరింది. అయితే, విజయసాయి రాజీనామాతో Vijayasai resignation ఏర్ప‌డిన ఖాళీని త‌మకు ఇవ్వాల‌ని బీజేపీ తన మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీని కోరింది. అందుకు బాబు స‌మ్మ‌తించిన‌ట్లు తెలిసింది.

    AP Rajya Sabha | అన్నామ‌లై లేదా స్మృతికి చాన్స్‌

    పోటీకి సిద్ధ‌మైన బీజేపీ ఇద్ద‌రి పేర్ల‌ను ప‌రిశీలిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ former Union Minister Smriti Irani, తమిళనాడు బీజేపీ చీఫ్ మాజీ అన్నామలై former Tamil Nadu BJP chief Annamalai పేర్లు ప‌రిశీలిస్తోంది. లోక్‌సభ ఎన్నిక‌ల్లో Lok Sabha elections అమేథి నుంచి ఓడిపోయిన స్మృతి ఇరానీకి రాజ్య‌స‌భ Rajya Sabha స్థానం ఇచ్చే అవ‌కాశ‌ముంది. మరోవైపు, మొన్న‌టిదాకా త‌మిళ‌నాడు బీజేపీ Tamil Nadu BJP సార‌థిగా ప‌ని చేసిన అన్నామ‌లై ఇటీవ‌లే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. త‌మిళ‌నాడులో Tamil Nadu త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు assembly elections జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుకు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే AIADMK ఒత్తిడి మేర‌కు అన్నామ‌లైని Annamalai బీజేపీ నాయ‌క‌త్వ‌మే త‌ప్పించిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం రాజీనామా ఆయ‌న‌కు మ‌రో రూపంలో బీజేపీ అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని, అందులో భాగంగానే ఏపీ నుంచి పోటీ చేయించ‌నున్న‌ట్లు కాషాయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

    More like this

    Kamareddy | కన్నతల్లిని హత్య చేసిన కసాయి కొడుకు అరెస్ట్

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే అపరిశుభ్రం చేస్తోందని తల్లిని తీసుకెళ్లి నదిలో తోసేసి...

    IOB Notification | ఐవోబీలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IOB Notification | స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(Specialist Officer) ఉద్యోగాల భర్తీ కోసం ఇండియన్‌ ఓవర్సీస్‌...

    Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికపై కాంగ్రెస్​ ఫోకస్​.. నేడు సీఎం కీలక సమావేశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో(Jubilee Hills by Election) గెలుపే లక్ష్యంగా...