Pakistan attack | సరిహద్దులో ఉద్రిక్తత.. పాక్​ కాల్పులు, డ్రోన్ల దాడులు
Pakistan attack | సరిహద్దులో ఉద్రిక్తత.. పాక్​ కాల్పులు, డ్రోన్ల దాడులు

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan attack : భారత సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్​ దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు పాకిస్తాన్​ దాడులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నిస్తోంది.

కాగా.. భారత సైన్యం ప్రతిదాడులతో సమర్థంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ఉధంపుర్, అఖ్నూర్, నగ్రోటా, సాంబా, జమ్మూ, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో 50 పాక్‌ డ్రోన్లను ఇండియన్​ ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్‌లోనూ డ్రోన్లతో పాక్‌ దాడులు చేపట్టగా.. తిప్పికొట్టినట్లు ఇండియన్​ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.