అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వన్ టౌన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి (One Town SHO Raghupathi) తెలిపారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌కు చెందిన మొహీనుద్దీన్ తన బైక్ చోరీకి గురైందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని బోధన్ బస్టాండ్ (Bodhan Bus stand) ప్రాంతంలో వాహన తనిఖీలు చేపడుతుండగా, సరైన పత్రాలు లేక, అనుమానాస్పదంగా తిరుగుతున్న డిచ్‌పల్లి మండలం నడిపల్లికి చెందిన సయ్యద్ మజద్‌ను అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి గతంలో సైతం మూడుసార్లు బైక్‌లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు అతని వద్ద నుంచి నాలుగు బైక్‌ల ు స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
