అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయమూర్తి జీవితఖైదు విధించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర (Kamareddy SP Rajesh Chandra) వెల్లడించారు.
సదాశివనగర్‌కు చెందిన మాడల సతీష్‌ను అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవికుమార్ 2020, జూలై7న బండరాయితో మోది హత్య చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు రవికుమార్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టుకు ఆధారాలు సమర్పించారు. శుక్రవారం జిల్లా కోర్టులో కేసు తుది విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో నిందితుడు రవికుమార్‌కు జీవితఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి వీఆర్‌ఆర్ వరప్రసాద్ (Kamareddy District Judge VRR Prasad) తీర్పు ఇచిన్నట్లు ఎస్పీ వెల్లడించారు.