Bhubarathi | భూభారతి దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి
Bhubarathi | భూభారతి దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhubarathi | భూభారతి దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ (Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం లింగంపేట్‌ ఎంపీడీఓ కార్యాలయంలో (Lingampet MPDO Office) నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా గతనెలలో మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతులు నుంచి భూవివాదాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు. 4,225 దరఖాస్తులు రాగా, వాటిని పరిష్కరించేందుకు 9 టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు 1,443 దరఖాస్తులకు సంబంధించిన భూములను పరిశీలించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్ (Kamareddy Additional Collector Victor), సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi), ఆర్డీవో ప్రభాకర్, భూ భారతి ప్రత్యేక అధికారి రాజేందర్, ల్యాండ్‌ సర్వే సహాయ సంచాలకుడు శ్రీనివాస్, ఎఫ్‌డీఓ రామకృష్ణ, తహసీల్దార్లు, రెవెన్యూ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.