CM Revanth | ఒక నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్‌కు ఇద్దాం : సీఎం రేవంత్
CM Revanth | ఒక నెల జీతాన్ని డిఫెన్స్ ఫండ్‌కు ఇద్దాం : సీఎం రేవంత్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | భారత్​ – పాకిస్తాన్​ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్ operation Sindoor ​తో ఉలిక్కిపడ్డ పాక్​ సామాన్య పౌరులు, ఆలయాలు, ఎయిర్​పోర్టులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది.

దాయది దేశం దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం రేవంత్​రెడ్డి cm revanth reddy ప్రజాప్రతినిధులకు కీలక సూచన చేశారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు mla, ఎమ్మెల్సీలు mlcల ఒక నెల వేతనం నేషనల్ డిఫెన్స్ ఫండ్‌ national defence fundకు విరాళంగా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క bhatti vikramarka విరాళం ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ముందుకు రావాలని సీఎం కోరారు.