అక్షరటుడే, వెబ్డెస్క్: CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎంత ఎక్కువ మంది పిల్లలను కంటే అన్ని వసతులు కల్పిస్తామని, ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పెద్ద కుటుంబం ఉంటే ఎక్కువ వసతులు కల్పిస్తాం.. ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో హంద్రీనీవా పనులను శుక్రవారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనాలన్నారు. పేదరికంతో ఎంతో మంది చదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ఆర్థికంగా ఉన్నవాళ్లు పేదల చదువుకు సాయం చేయాలని ఆయన సూచించారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు.