ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం: కేంద్రం

    Operation Sindoor | పాక్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం: కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Operation Sindoor | పాకిస్తాన్​ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని కేంద్రం తెలిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్​ మిస్త్రీ vikram misri, కల్నల్​ సోఫియా ఖురేషీ sofia khureshi, ఎయిర్​ఫోర్స్​ వింగ్​ కమాండ్​ వ్యోమికాసింగ్ vyomika singh శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

    నిన్న రాత్రి పలు నగరాలు, ఎయిర్​పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ దాడులకు పాల్పడిందన్నారు. భారత గగనతలంలోకి డ్రోన్లు, విమానాలు వచ్చాయన్నారు. పాకిస్తాన్​ ప్రయోగించిన డ్రోన్​లను paistan drones సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. నాలుగు ఎయిర్​పోర్టులు లక్ష్యంగా పాక్​ దాడులకు దిగిందని చెప్పారు. 300 – 400 డ్రోన్లతో దాడికి యత్నించిందని తెలిపారు. 36 చోట్ల దాడులకు యత్నించిందని పేర్కొన్నారు. వీటిని భారత్​ సమర్థవంతంగా కూల్చివేసిందని చెప్పారు. డ్రోన్లు టర్కీకి turky drones చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు.

    Operation Sindoor | భారత్​ సంయమనం..

    ప్రతిదాడుల విషయంలో భారత్​ సంయమనం పాటించిందని పేర్కొన్నారు. భటిండా, ఉదంపూర్​ ఎయిర్​ పోర్టులు లక్ష్యంగా పాక్​ దాడులకు ప్రయత్నం చేసిందని చెప్పారు. భారత్​ ఎదురుదాడిలో పాక్​ భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్​ సంయమనం పాటించిందన్నారు. పౌర విమానాలను రక్షణగా చేసుకుని పాక్​ దాడులు చేస్తోందన్నారు.

    Operation Sindoor | గురుద్వారాలు, ఆలయాలే లక్ష్యంగా..

    ఎల్​వోసీ వెంబడి పాక్​ నిరంతరాయంగా కాల్పులు జరుపుతోందని చెప్పారు. సరిహద్దులో భారీ ఆర్టిలరీలతో కాల్పులకు జరుపుతోందని వివరించారు. మన గురుద్వారాలు, ఆలయాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని భావించిందని చెప్పారు. కర్తార్​పూర్​ కారిడార్​ను మూసివేశామని చెప్పారు.

    More like this

    Ex Mla Jajala Surendar | రైతులను ఆదుకోకుంటే బీసీ సభను అడ్డుకుంటాం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ex Mla Jajala Surendar | ఇటీవలి భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని...

    Chakali Ailamma | పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ సేవలు మరువలేం..

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | నగరంలోని బోర్గాం(పి) చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం...

    Kamareddy | గొర్ల మందను ఢీకొన్న లారీ.. గొర్ల కాపరితో సహా 30 గొర్లు మృతి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | అతివేగంగా వస్తున్న లారీ గొర్ల మందపైకి దూసుకెళ్లగా గొర్ల కాపరితో పాటు 30...