ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | పాక్​పై భారత్​ చర్యలు సరైనవే.. పార్టీల నేతలు

    Operation Sindoor | పాక్​పై భారత్​ చర్యలు సరైనవే.. పార్టీల నేతలు

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​/కామారెడ్డి:Operation Sindoor | భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పహల్గామ్​(Pahalgam attack) ఘటనపై కేంద్రం ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్​ సిందూర్’​(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్​ లోని ఉగ్రమూకల భరతం పడుతోంది. ఈ ఘటనతో భారతీయులు (Indians) హర్షతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు​ పోరును కొనసాగించాలని.. సైన్యానికి యావత్ ప్రజలు అండగా ఉంటారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పార్టీల నేతలు పేర్కొంటున్నారు

    Operation Sindoor | భారత్​తో తలపడేముందు ఆలోచించాలి..

    – మానాల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నిజామాబాద్​

    భారతదేశ సైనిక బలం(Indian Military Strength), సంపద, శక్తి సామర్థ్యాలను పాక్ తక్కువగా అంచనా వేసింది. పాక్ మూలాలను దెబ్బతీసే శక్తిసామర్థ్యాలు మన సైన్యం వద్ద ఉంది.​ భారత్​తో తలపడేముందు పాకిస్తాన్ ఆలోచించాల్సి ఉండాల్సింది. సైనికులు(Soldiers)చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ తరపున, వ్యక్తిగతంగా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను.

    Operation Sindoor | టెర్రరిజంను రూపుమాపాలి

    – నీలం చిన్న రాజులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి

    టెర్రరిజాన్ని సమూలంగా రూపుమాపే సమయం ఆసన్నమైంది. ఆ దిశగా ప్రపంచ దేశాలు ఏకం కావాలి. పాకిస్తాన్ టెర్రరిజానికి మద్దతిస్తుందని ప్రపంచ దేశాలు కూడా నమ్ముతున్నాయి. భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు పాకిస్తాన్​పై ఆగ్రహంతో ఉన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) నేతృత్వంలో టెర్రరిజం రూపుమాపడం ఖాయం.

    Operation Sindoor | ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు

    – ముజీబోద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి

    పాకిస్తాన్​(Pakistan)కు గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వానికి వ్యక్తిగతంగా, పార్టీపరంగా సంపూర్ణ మద్దతునిస్తున్నాం. పాకిస్తాన్ మరోసారి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా కేంద్రం గట్టి గుణపాఠం చెబుతోంది. పాక్ ఆక్రమిత భూభాగాన్ని భారత ప్రభుత్వం (India Government) స్వాధీనం చేసుకోవాలి. దేశం ఐక్యంగా ఉందని పాకిస్తాన్​కు తెలిసేలా కేంద్ర ప్రభుత్వం నిరూపించింది.

    Operation Sindoor | ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

    – ఫయాజుద్దీన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్

    కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఎంఐఎం పార్టీ(MIM Party) తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. భారత సైన్యం(Indian Army) ఉగ్ర మూకలపై జరుపుతున్న దాడికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మన భారతదేశానికి ఎంఐఎం పార్టీ లాయర్​గా ఉంటుంది. పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ప్రతి మీటింగ్​లో ఉగ్రవాదులను అంతం చేయాలని పిలుపునిస్తున్నారు.

    ఉగ్రవాద మూలాలను అణిచివేయాలి

    – కైలాస్ శ్రీనివాస్ రావు, డీసీసీ అధ్యక్షుడు, కామారెడ్డి

    భారతదేశం నుంచి ఉగ్రవాద మూలాలను అణచివేయాలి. కాంగ్రెస్ పార్టీకి దేశ సమగ్రత ముఖ్యం. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించేందుకు భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. పాకిస్తాన్​తో యుద్ధం విషయంలో అన్ని విధాలుగా మద్దతు తెలుపుతాం.

    ఉగ్ర స్థావరాలపైనే దాడి..

    – దినేష్ కులాచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్

    పహల్గామ్​ ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. మతాన్ని అడిగి మరీ హతమార్చడం హేయమైన చర్య. అందుకే మోదీ ప్రభుత్వం కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేస్తోంది. సామాన్యుల జోలికి వెళ్లడం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇది నిజమైన నివాళి.

    ఇండియన్​ ఆర్మీకి సెల్యూట్​..

    – బాజిరెడ్డి జగన్​మోహన్​, బీఆర్​ఎస్​ యువనేత

    విపత్కర పరిస్థితుల్లో ఇండియన్​ ఆర్మీ ప్రదర్శిస్తున్న తెగువకు సెల్యూట్​ చేస్తున్నా.. పహల్గామ్​ దాడికి ప్రతీకారంగా మహిళా ఆర్మీ అధికారుల సారథ్యంలో పాకిస్తాన్​పై దాడులు చేయడం ప్రశంసనీయం. పాకిస్తాన్​ ద్వంద్వ వైఖరిని ప్రపంచం గమనిస్తోంది. ఉగ్రవాదులు వాళ్ల దేశంలోనే ఉన్నా ఇన్నాళ్లు కప్పిపుచ్చుకుంది. మా పార్టీ అధినేత కేసీఆర్​ ఇప్పటికే కేంద్రం చర్యలకు మద్దతు తెలిపారు.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    More like this

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...