అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా home minister amit shah తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఉదయం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ Defence Minister rajnath singh ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సరిహద్దులో భద్రత గురించి ఈ సమావేశంలో చర్చించారు. పాక్ దాడులు, వాటిని ఎలా తిప్పికొట్టామో అధికారులు వివరించారు. ఎయిర్ పోర్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన వివరించారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు.