ePaper
More
    HomeసినిమాMegastar Chiranjeevi | శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందా.. చిరంజీవి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

    Megastar Chiranjeevi | శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుందా.. చిరంజీవి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ (megastar chiranjeevi daughter Srija) త‌న పెళ్లి వార్త‌ల‌తో ఎక్కువగా వార్త‌ల‌లో నిలిచింది. చిరంజీవి ఎలాంటి వివాదాల‌లో త‌ల దూర్చకుండా ప్ర‌శాంతంగా జీవనం సాగిస్తుంటాడు. అయితే శ్రీజ వ‌ల‌న చిరు కొంత ఇబ్బంది ప‌డ్డాడు. మొద‌ట తాను ప్రేమించిన శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ని పెళ్లి చేసుకొని (love marriage with sirish bhardwaj) ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అప్ప‌ట్లో ఈ విష‌యం ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే బిడ్డ పుట్టిన తర్వాత శిరీష్ భరద్వాజ్ తో వచ్చిన అభిప్రాయ బేధాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ దేవ్ అనే వ్య‌క్తితో శ్రీజ వివాహం (srija married kalyan dev) జ‌రిపించారు చిరు.

    Megastar Chiranjeevi | ఇదా కార‌ణం?

    శ్రీజ పెళ్లిని కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా జరిపించారు. శ్రీజతో వివాహం తర్వాత కల్యాణ్ దేవ్ 2018లో విజేత చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం (kalyan dev as hero debut with vijetha movie) అయ్యారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే వారు 2019 తర్వాత విభేదాల కారణంగా విడిపోయిన‌ట్టు స‌మాచారం. ఇద్ద‌రు భ‌ర్త‌ల నుండి విడిపోయిన కూడా శ్రీజ త‌న పిల్ల‌లిద్ద‌రిని త‌న వ‌ద్దే ఉంచుకుంటూ ఆల‌నాపాల‌నా చూసుకుంటుంది. ప్రస్తుతం తన తండ్రి వద్దే ఉంటున్న ఈమె మూడో పెళ్లి చేసుకోలేదు. ఆ మ‌ధ్య శ్రీజ మూడో పెళ్లికి (srija third marriage) సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగాయి. అయితే దానిపై మెగా ఫ్యామిలీ (Mega Family) స్పందించింది లేదు.

    అయితే చిరంజీవి (Chianjeevi) తిరిగి తన బిడ్డకు పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవికి (megastar chiranjeevi) వేలకోట్లు ఆస్తి ఉన్న తన బిడ్డ మాత్రం ఒంటరిగా ఉండ‌టానికి కార‌ణం ఇది అంటూ ఓ వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. శ్రీజ జాతకం ప్రకారం తనకు పెళ్లి కలిసి రాలేదని తెలుస్తోంది. శ్రీజ జాతకం పండితులకు చూయించిన తర్వాత వారు ఈమెకు పెళ్లి కలిసి రాదని చెప్పార‌ట‌. అందుకే చిరంజీవి తన కుమార్తెకు మూడో పెళ్లి చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని స‌మాచారం. లేదంటే చిరంజీవికి ఉన్న ఫేమ్ కి డబ్బుకి పలుకుబడికి శ్రీజకి మూడో పెళ్లి (srija third marriage) చేయడం చాలా చిన్న విష‌యం. మ‌రి ప్ర‌స్తుతం నెట్టింట జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంలో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

    Latest articles

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    More like this