అక్షరటుడే, వెబ్‌డెస్క్:Miss World | హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు(Miss World competitions) శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 111 దేశాల అందగత్తెలు హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. తాజాగా మిస్ వరల్డ్ పిస్కోవా(Miss World Piskova) శంషాబాద్ చేరుకోగా ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు శనివారం జరిగే మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకల కోసం పోటీదారులు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం(Gachibowli Stadium)లో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈవెంట్ కో–ఆర్డినేటర్ల మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. కాగా దేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగే ప్రాంతాలు, అతిథులు బస చేసే హోటళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. రేపు ప్రారంభోత్సవ వేడుకల్లో భారతీయ, అంతర్జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.