అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాల్లో యుద్ధ భయం నెలకొంది. పాక్ దాడులను భారత్(India) తిప్పి కొడుతోంది. ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Air Defense System) సైతం భారత్ ధ్వంసం చేసింది. దీంతో నేరుగా ఏమి చేయలేని పాక్(Pakistan) మళ్లీ వక్రమార్గాలను ఎంచుకుంటుంది. భారత్లోకి ఉగ్రవాదులను(Terrorists) పంపి అలజడులు సృష్టించాలని పన్నగం పన్నింది. అక్రమంగా భారత్లోకి రావడానికి యత్నించిన ఏడుగురిని బీఎస్ఎఫ్(BSF) హత మార్చింది. జమ్మూకశ్మీర్లోని సాంబ సెక్టార్లో జైషేమహ్మద్(Jaish-e-Mohammed) చెందిన ఏడుగురు చొరబాటుకు యత్నించారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు(BSF Soldiers) వారిని మట్టుబెట్టారు.