అక్షరటుడే, వెబ్‌డెస్క్: India – Pakistan tensions | భారత్–పాక్ ఉద్రిక్తతలపై చైనా స్పందించింది. ఓ వైపు దాయాది దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తున్న డ్రాగన్ దేశం (dragon country china) చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించింది. తాము ఉగ్రవాదాన్ని(Terrorism) వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇరు దేశాలు శాంతిమార్గం అనుసరించాలని, అంతర్జాతీయ చట్టాలను పాటించాలని సూచించింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తామని చైనా తెలిపింది.
