అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | భారత్ – పాక్ ఉద్రిక్తతలపై (India-Pak tension) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (US vice president JD vance) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాక్ యుద్ధం విషయంలో అమెరికా జోక్యం (America not interfere in India-Pakistan war) చేసుకోదని ఆయన తెలిపారు. ఇది అమెరికాకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన అన్నారు. సంబంధంలేని యుద్ధంలో మేం జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా తీవ్రత తగ్గించుకోవాలని ఆయన ఇరు దేశాలకు సూచించారు. ఇది అణు యుద్ధంగా (nuclear war) మారుతుందని తాను భావించడం లేదన్నారు. కాగా ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించిన విషయం తెలిసిందే (US president donald trump respond to operation sindoor). ఆయన రెండు దేశాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. చర్చల కోసం కావాలంటే తాను సాయం చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
Operation Sindoor | భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
Published on
