అక్షరటుడే, న్యూఢిల్లీ: Massive destruction in Lahore : దాయాది దేశంపై భారత్ విరుచుకుపడుతోంది. నిన్న రాత్రి నుంచి దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు పాక్ దాడులను తిప్పికొడుతోంది. పాక్ డ్రోన్లను అధునాతన రక్షణ వ్యవస్థతో నేలమట్టం చేసింది. కాగా, నిన్న రాత్రి నుంచి చేపట్టిన దాడులతో లాహోర్‌లో భారీగా విధ్వంసం జరిగినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పాక్‌లోని 7 ప్రధాన నగరాలపై భారత్ క్షిపణులను ప్రయోగించింది.
భారత్ దాడులతో పాక్ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇక భారత్‌పై పాక్ దాడి కొనసాగుతోంది. ఈ క్రమంలో అమృత్సర్ స్వర్ణ దేవాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక్కడి సరిహద్దు సమీపంలోని అటారీ గ్రామాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఇక్కడ రాత్రంతా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ప్రజలు చీకట్లోనే రాత్రంతా ఉండిపోయారు.
ఇక పాకిస్తాన్ యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. ఎఫ్‌జే 27, జెట్ ఫ్లైట్లను భారత్ నేలమట్టం చేసింది. పంజాబ్‌లోని భటిండాలో పాక్ డ్రోన్‌ను భారత్ కూల్చివేసింది. ఇలా పాక్‌కు చెందిన 50 డ్రోన్లను కూడా ఇండియన్ ఆర్మీ తుదముట్టించింది.
భారత్ సౌర్వభౌమత్వాన్ని రక్షించేందుకు తాము ఎల్లప్పుడు సిద్దంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పాక్ దాడులను ఎలా తిప్పికొట్టిందో .. ఆ వివరాలను వెల్లడించింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లలో 50 పాక్ డ్రోన్లను నేలమట్టం చేసినట్లు ప్రకటించింది.