Emergency in Pakistan |విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు.. పాక్​లో అత్యవసర స్థితి
Emergency in Pakistan |విరుచుకుపడుతున్న త్రివిధ దళాలు.. పాక్​లో అత్యవసర స్థితి

అక్షరటుడే, న్యూఢిల్లీ: emergency in Pakistan : పహల్గావ్​ ఉగ్రదాడికి భారత్​ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాకిస్తాన్​పై భారత్​ విరుచుకుపడుతోంది. త్రివిధ దళాలు పాక్​ను అష్ట దిగ్బంధం చేశాయి. భారత్​ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్​.. అంతర్గతంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అక్కడి 20 నగరాల్లో అత్యవసర స్థితి కొనసాగుతోంది.

మరోవైపు భారత్​ సరిహద్దు గ్రామాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామన 3 నుంచి 5 గంటల మధ్య పాక్​ హమాస్​ తరహా దాడులకు దిగింది. పౌరుల వాహనాలను ధ్వంసం చేసింది. అప్పటికే రాత్రంతా బ్లాక్​ ఔట్​ కొనసాగింది.

మరోవైపు సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు నిద్రలేని రాత్రిని గడిపారు. పాక్​ దాడుల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పాక్​ దాడులతో భయపడిపోయిన ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది.