Shubham Movie Review | శుభం మూవీ రివ్యూ.. నిర్మాత‌గా స‌మంత‌కి హిట్ ప‌డిందా?
Shubham Movie Review | శుభం మూవీ రివ్యూ.. నిర్మాత‌గా స‌మంత‌కి హిట్ ప‌డిందా?

చిత్రం: ‘శుభం’ shubham
నటీనటులు: సమంత Samantha, హర్షిత్ Harshit, శ్రీనివాస్ రెడ్డి, చరణ్ పేరి, శ్రియా కొంతం,శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ gangavva తదితరులు.
సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
బ్యానర్స్: ట్రాలాలా ప్రొడక్షన్స్ tralala priductions
నిర్మాత: సమంత రుత్ ప్రభు ప్రొడ్యూసర్ samantha
దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల

ఈ మ‌ధ్య న‌టీన‌టులు నిర్మాత‌లుగా మారి వైవిధ్య‌మైన సినిమాల తెర‌కెక్కించ‌డం కామ‌న్ అయింది. నాని hero nani నిర్మాత‌గా మారి మంచి హిట్స్ అందిస్తుండ‌డం మ‌నం చూస్తున్నాం. ఇప్పుడు స‌మంత samantha ruthu prabu కూడా శుభం చిత్రంతో నిర్మాత‌గా మారింది. ట్రాలాల ప్రొడక్షన్ tralala priductions బ్యానర్ పై ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ‘శుభం’ సినిమా నిర్మించ‌డంతో పాటు మూవీలో ఓ కీలక పాత్రలో నటించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా సమీక్షలో చూద్దాం..

కథ : వైజాగ్ లోని భీమునిపట్నం గ్రామంలో కేబుల్ టీవీ ఆపరేటర్‌ శ్రీను (హర్షిత్ రెడ్డి), తన ఇద్దరు స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ) లైఫ్ హ్యాపీగా గడుపుతుంటారు. అయితే శ్రీనుకి శ్రీవల్లి (శ్రియా కొంతం)తో పెళ్లి అవుతుంది. ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ తో లోపలికి వచ్చిన శ్రీవల్లి.. సీరియల్ టైం అవ్వగానే వెళ్లి టీవీ ముందుకు కూర్చుంటుంది. అదేంటని శీను అడగ్గానే దయ్యం పట్టినట్టు చేస్తుంది. ఇదే విషయం తన స్నేహితులకు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని అంటారు. మిగ‌తా వారిని క‌నుక్కుంటే వారి ఇళ్ల‌ల్లో కూడా అలానే అవుతుంద‌ని, సీరియ‌ల్ చూస్తున్న స‌మ‌యంలో ఆడ‌వాళ్ల దెయ్యం ప‌ట్టిన‌ట్టు తెగ హంగామా చేస్తుంటారు. పరిష్కారం కోసం అదే ఊర్లో ఉన్న మాత మాయ (సమంత రుత్ ప్రభు)ను సలహా కోసం ఆశ్రయిస్తారు. మరి వారి భార్యలను బాగు చేసుకోవడంతో పాటు ఊర్లో ఆడవాళ్లను మాములు మనుషులుగా చేయడానికి ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేసారు. అనేదే శుభం సినిమా కథ.

Shubham Movie Review | న‌టీన‌టు ప‌ర్‌ఫార్మెన్స్

చిత్రంలో స‌మంత త‌ప్ప అంద‌రు కొత్త వారే. ముఖ పరిచయం లేని మూడు జంటలు తమ పెర్ఫార్మెన్స్‌తో రెండు గంటలపాటు సీట్లలో అత్తుకుపోయేలా చేశారు. మెయిన్ హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి అద‌ర‌గొట్టాడు. అలాగే హీరోయిన్ శ్రియ కొంతం కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మిగిలిన ఇద్దరు స్నేహితులు శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి ప‌ర్ఫార్మెన్స్ బాగుంది. వాళ్ల భార్యలుగా నటించిన శాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మి నటన చాలా బాగుంది. మరో ఇంపార్టెంట్ పాత్రలో వంశీధర్ అద‌ర‌గొట్టాడు. అతిథి పాత్రల్లో కనిపించిన సమంత ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. మిగతా పాత్రల్లో వారంతా తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు.

Shubham Movie Review | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్

చిత్రానికి సంగీతం అందించిన క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ ఆక‌ట్టుకున్నారు. పాటలు కూడా పర్లేదు. ఎడిటింగ్ బాగుంది.. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ కండ్రెగుల మరోసారి త‌న టాలెంట్ చూపించాడు. ఈసారి సీరియల్స్ ను టార్గెట్ చేసి తన కథ రాసుకున్నాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రం ద్వారా ఆడవాళ్లను గౌరవించాలి.. వాళ్లని తక్కువగా చూడకూడదని మెసేజ్ ఇచ్చాడు..ముగ్గురు దంపతుల క్యారెక్టర్లను మలిచిన విధానం.. అలాంటి పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానమే ఈ సినిమా సక్సెస్‌కు బాట వేసిందని చెప్పవచ్చు

ప్ల‌స్ పాయింట్స్:

క‌థ‌
న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్
సంగీతం
ద‌ర్శ‌క‌త్వం

మైన‌స్ పాయింట్స్:

క్లైమాక్స్
స్లో న‌రేష‌న్

విశ్లేష‌ణ‌: మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ నిత్యం జరిగే త‌మాషా సంఘ‌ట‌న‌ల‌ని, దాని వ‌ల‌న కాపురాల‌లో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకుంటాయ‌నే విష‌యాన్ని చాలా కామెడీ చూపించాడు ద‌ర్శ‌కుడు. ‘సినిమాబండి’ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రంలో ప్రేక్ష‌కుల‌కి ఎక్క‌డా బోర్ ఫీలింగ్ రానివ్వ‌లేదు. పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన విధానమే ఈ సినిమా సక్సెస్‌కు బాట వేసిందని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా మన దర్శకులు 80, 90ల నాటి బ్యాక్ డ్రాప్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల కూడా ‘శుభం’ కథను 2004 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. అప్పట్లో కేబుల్ టీవీ ప్రతి ఇంటిలో ఎలా భాగం అయిందో.. దానికి పోటీగా డీటీహెచ్ రావ‌డంతో కేబుల్ టీవీ ప్రాపకం ఎలా మసకబారిందో అనే అంశాలను అంతర్లీనంగా చూపించాడు. మెజారిటీ మహిళలు చాలా మంది ఏ విషయంలోనైనా శుభప్రదమైన ముగింపు ఉండాలని కోరుకుంటారు. అదే అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో చక్కటి వినోదంతో చూపించాడు. తెరపై చూస్తేనే మజా వస్తుంది. మొత్తంగా సమంత నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి మెసేజ్ సినిమా తీసి ఆక‌ట్టుకుంది.

రేటింగ్‌: 3.25