India Pakisthan War | సరిహద్దులో భీకర పోరు.. ఉదయం 10 గంటలకు ప్రెస్​మీట్​
India Pakisthan War | సరిహద్దులో భీకర పోరు.. ఉదయం 10 గంటలకు ప్రెస్​మీట్​

అక్షరటుడే, న్యూఢిల్లీ: India Pakisthan War : భారత్​, పాకిస్తాన్ india pakistan war నడుమ యుద్ధమే కొనసాగుతోందని చెప్పాలి. పాకిస్తాన్ దొంగచాటు దెబ్బతీయాలని చూస్తోంది. సరిహద్దులోని గ్రామాల్లో అమాయక ప్రజలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పూంచ్​ సెక్టార్ లో దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే పలువురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు యూరిలోనూ uri sector భీకర పరిస్థితి కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇక నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం, విదేశాంగ మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపాయి. నిన్న రాత్రి నుంచి పాక్​ చేపట్టిన దాడుల వివరాలు వెల్లడించనున్నాయి.