Pakistan Prime Minister | బంకర్లోకి పాక్​ ప్రధాని.. భారత్​ ప్రతిదాడితో భయపడిపోయిన షెహబాజ్​ షరీఫ్​!
Pakistan Prime Minister | బంకర్లోకి పాక్​ ప్రధాని.. భారత్​ ప్రతిదాడితో భయపడిపోయిన షెహబాజ్​ షరీఫ్​!

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan Prime Minister : పహల్గావ్​ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్​ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇరు దేశాల నడుమ భీకర పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌ బంకర్లోకి వెళ్లిపోయారు.

ఇస్లామాబాద్‌లో అత్యధిక కట్టదిట్టమైన భద్రతా ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించడంతో ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ సహా కీలక ప్రభుత్వ వ్యక్తుల భద్రత కట్టదిట్టం చేశారు. ఈ క్రమంలోనే షరీఫ్​ బంకర్లో దాక్కున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ప్రకటన లేకపోయినప్పటికీ భారత్ ప్రతిదాడికి భయపడిపోయినట్లు తెలుస్తోంది.