అక్షరటుడే, న్యూఢిల్లీ: Nowshera sector : యూరీలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. బాంబుల మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. కాల్పులకు తెగబడుతున్న పాక్ సేనను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది.
మరోవైపు నౌషెరా సెక్టార్ వద్ద ఇరువైపులా పెద్ద మొత్తంలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రెండు పాక్ డ్రోన్లను భారత సేన కూల్చివేసింది.
మరోవైపు సాంబా సెక్టార్‌లోనూ పాక్ కాల్పులకు దిగింది. జమ్మూలోని సాంబా సెక్టార్‌లో పాక్ సైన్యానికి బీఎస్ఎఫ్ సైనికులు తమ తూటాలతో తగిన సమాధానం ఇస్తున్నారు. షకార్గ్, సియాల్‌కోట్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్‌ఎఫ్ కాల్పులు కొనసాగిస్తోంది.