India pakisthan war | భారత్​ ప్రతీకార దాడి.. యుద్ధ విమానాలను కోల్పోవడంతో పాక్​ మొసలి కన్నీరు
India pakisthan war | భారత్​ ప్రతీకార దాడి.. యుద్ధ విమానాలను కోల్పోవడంతో పాక్​ మొసలి కన్నీరు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan attacks | ఆపరేషన్​ సిందూర్​తో (Operation Sindoor) బుద్ధి తెచ్చుకోని పాక్​ మళ్లీ దాడులకు తెగబడుతోంది.

గురువారం రాత్రి జమ్మూ ఎయిర్​పోర్టుపై (Jammu airport) రాకెట్లతో దాడి చేసింది. అంతేగాకుంగా జమ్ములోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో అటాక్​ (drone attacks) చేసింది. ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించినట్లు సమాచారం. దీంతో ఆర్మీ అధికారులు (army officials) జమ్ము నగరం మొత్తం బ్లాక్‌అవుట్‌ జారీ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. పాక్​ డ్రోన్లను భారత సైన్యం కూల్చి వేసింది. ఈ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. డ్రోన్ పేలుళ్ల శబ్దానికి స్థానిక ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.