అక్షరటుడే, వెబ్‌డెస్క్ : YS Jagan | తమ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే పోలీసులు, అధికారులకు వదిలిపెట్టమని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (former cm and YCP chief jagan) అన్నారు. ఆయన మాట్లాడుతూ పోలీసులకు జగన్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసులు, అధికారుల పేర్లు నోట్ చేసుకోండి (note police and officials names). యూనిఫాంకు ఉన్న విలువ వారికి అర్థం కావాలి” అని జగన్ కార్యకర్తలకు సూచించారు (jagan advaised workers). ఒకవేళ వారు రిటైర్ అయిపోయినా, దేశం వదిలి వెళ్లిపోయినా.. సప్త సముద్రాల అవతల ఉన్న వదిలి పెట్టమని స్పష్టం చేశారు. ఈ సారి సినిమా మామూలుగా ఉండదని, అదో లెవెల్లో ఉంటుందన్నారు.
