అక్షరటుడే, వెబ్డెస్క్: GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ Greater Hyderabad Municipal Corporation పన్ను చెల్లింపుదారులకు శుభవార్త చెప్పింది. అసెస్మెంట్ తదితర పన్ను చెల్లింపులకు సంబంధించి మొబైల్ నంబర్ mobile numbers update అప్డేట్ కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పించింది. వ్యాపారులు, ప్రజలు Traders and people ఇకపై జీహెచ్ఎంసీ GHMC వెళ్లకుండానే నంబర్ అప్డేట్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. దీనికోసం ఆన్లైన్లో అప్లికేషన్ను online application తయారు చేసింది.
ఫోన్ నంబర్ phone number అప్డేట్ చేసుకోవాలనుకునే వారు జీహెచ్ఎంసీ వెబ్సైట్ ఆన్లైన్ onlinepayments.ghmc.gov.in కు వెళ్లి పేమెంట్ ఆప్షన్ను payment option ఎంచుకుని ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇదిపన్ను చెల్లింపుదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీఎంహెచ్సీ తెలిపింది.
కాగా.. ఆస్తి, ట్రేడ్ పన్నులకు property and trade taxes సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మొబైల్ నంబర్ ద్వారా తెలిపేందుకు ఈ విధానం అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో వ్యాపారులు, ప్రజలు ఎప్పటికప్పుడు పన్ను చెల్లింపులను పూర్తి చేసుకోవచ్చు. ఫలితంగా పెనాల్టీలు penalties కూడా పడకుండా ఉంటాయని, అలాగే రాయితీలు ప్రకటించిన సమయంలో తాజా సమాచారం అందుతుందని అధికారులు GHMC officials వెల్లడించారు.