అక్షరటుడే, ఇందూరు: Intermediate Education| ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్(Nizamabad Additional Collector Kiran Kumar) సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో రానున్న సప్లిమెంటరీ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం డీఐఈవో రవికుమార్(Nizamabad Intermediate Education Officer) మాట్లాడుతూ.. సప్లిమెంటరీ పరీక్షలకు (Inter Supplementary exams) 15 రోజుల ప్రత్యేక తరగతుల ప్రణాళిక రూపొందించామన్నారు. దీని ద్వారా వంద శాతం ఫలితాలను సాధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ(Nizamabad RTC) బస్సు సౌకర్యం లేదని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపితే అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో డీఈవో అశోక్, ఆర్టీసీ, ఫైర్ అధికారులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
