అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack కి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. కేంద్ర ప్రభుత్వం central govt ఆపరేషన్ సిందూర్ operation sindoor పేరిట చేపట్టిన ఈ చర్యను యావత్ భారతం స్వాగతిస్తోంది. అయితే కొందరు మాత్రం ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారికి తెలంగాణ పోలీసులు telangana police హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ operation sindoor కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేస్తామంది. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది.
