ePaper
More
    HomeసినిమాAllu Arjun | ఎందుకు బ‌న్నీ ఇలా వివాదాల‌లో ఇరుక్కుంటున్నాడు.. ఈ సారి ఆప‌రేష‌న్ సిందూర్...

    Allu Arjun | ఎందుకు బ‌న్నీ ఇలా వివాదాల‌లో ఇరుక్కుంటున్నాడు.. ఈ సారి ఆప‌రేష‌న్ సిందూర్ వ‌ల‌న‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Allu Arjun | అల్లు అర్జున్ allu arjun పుష్ప 2 చిత్రంతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్రేజ్ తో ఇప్పుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ (director atle movie) చేస్తున్నాడు. ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో రూపొంద‌నుంది. ఈ సినిమాపై అంచ‌నాలు పీక్స్‌లోనే ఉన్నాయి. అయితే బ‌న్నీకి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ విప‌రీతంగా పెరుగుతూ పోతుంది. ఇంతక ముందు మ‌న రాష్ట్రంలోనే కాక ఇత‌ర రాష్ట్రాల‌లోను ఫ్యాన్ పాలోయింగ్ ఉండేది. పుష్ప త‌ర్వాత బ‌న్నీ ఫాలోయింగ్ విదేశాల‌కి కూడా పాకింది. దేశ విదేశాల‌లో బ‌న్నీకి (allu arjun) విప‌రీత‌మైన అభిమాన గ‌ణం (huge fan base) ఏర్ప‌డుతుంది. ఇప్పుడు అదే ఆయ‌న‌కి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది.

    Allu Arjun | ఇంత ఫాలోయింగా…

    మంగళవారం అర్దరాత్రి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (operation sindoor) పై రాజకీయాలకు అతీతంగా సినీ సెల‌బ్రిటీలు (movie celebrities), క్రీడాకారులు, పారిశ్రామిక వేత్త‌లు, ప‌లువురు నేతలు స్పందించారు. కొంత మంది సెలబ్రీటీలు సైతం సోషల్ మీడియాలో జైహింద్, జై భారత్ (jai hind, jai bharath) అంటూ పోస్ట్ లు పెట్టారు. ఇదే క్ర‌మంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star allu arjun) కూడా ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర్మీకి మద్దతుగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. బన్నీ.. సోషల్ మీడియా ఖాతాలో ఆపరేషన్ సింధూర్ అనే ఫోటోను షేర్ చేసి ‘మేబీ జస్టిస్ సర్వ్డ్ .. జైహింద్’ (May justice be served.. jai hind) అంటూ రాసుకోచ్చారు. అయితే ఈ పోస్ట్ చూసిన చాలా మంది భారతీయులు గర్వపడుతున్నారు

    బంగ్లాదేశ్ , పాక్ లో ఉన్న బన్నీ అభిమానులు (bangladesh and pakistan allu arjun fans) మాత్రం కాస్త హ‌ర్ట్ అయిన‌ట్టు తెలుస్తుంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ (Allu arjun)కు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఏర్ప‌డ‌డంతో అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ పై.. పాక్, బంగ్లా అభిమానులు (pakistan and bangladesh fans) మాత్రం చాలా హర్ట్ అయ్యారు. వెంటనే అల్లు అర్జున్ ఆ పోస్ట్ ను డిలీట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు (social media posts) పెడుతు రచ్చ రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌పై 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్‌మెంట్ రియాక్ట్స్ (disappointed reactions) వ‌చ్చాయి ఇది చూసిన వారందరూ అల్లు అర్జున్‌కు ఇండియాలోనే కాకుండా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఇంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...