ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPaddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Paddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్/ఎల్లారెడ్డి : Paddy centers | ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలను (farmer) మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు (governament) మారినా.. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ప్రతీ సీజన్​లో మిల్లర్లు రైతులను మోసం (millers cheat farmers every season) చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు.

    నిజాంసాగర్ మండలం మాగి, లింగంపేట మండలం అయ్యపల్లి, షెట్పల్లి, లింగంపేట, మెంగారం తదితర గ్రామాల్లో (nizamsagar mandal, magi village) స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (paddy purchase center) నుంచి ఇప్పటివరకు 30కి పైగా లారీలు మిల్లులకు తరలించారు. నిర్వాహకులు తాలు లేకుండా మిషన్​ పట్టించాలనడంతో రైతులు (farmer) చెమటోడ్చి మిషన్​ పట్టారు. ఇలా శుద్ధి చేస్తే 40 కిలోల బస్తాకు అదనంగా 1.7 కేజీలు తూకం వేస్తే సరిపోతుందని నిర్వాహకులు చెప్పినప్పటికీ.. రైతులకు మాత్రం లాభం జరగట్లేదు.

    Paddy centers | చేతులు ఎత్తేస్తున్న నిర్వాహకులు

    కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు (purchasing center managers) చెప్పినట్లు తూకం వేసినా మిల్లర్లు మళ్లీ కోత పెడుతున్నారు. లేదంటే లారీలో నుంచి ధాన్యం దించుకోవడం లేదు. క్వింటాకు అదనంగా మూడు కిలలో తరుగు తీస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు (farmers are suffering serious losses). జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తరుగు దోపిడీ కొనసాగుతోంది. దీనిపై నిర్వాహకులను ప్రశ్నిస్తే.. మిల్లుకు తమ ధాన్యం చేరిన తర్వాత అక్కడ ఓకే చేసే వరకు రైతులదే బాధ్యత అని చెబుతున్నారు.

    Paddy centers | రూ.20 వేలు నష్టపోయా..

    –‌‌ మాటూరు శ్రీనివాస్, రైతు, మాగీ

    మిషన్​ పట్టించి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించా. తూకం సమయంలో బస్తాకు 41.7 కిలోలు జోకారు. మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ క్వింటాలుకు మూడు కిలోల చొప్పున కోత పెట్టారు. దీంతో మొత్తం రూ.20 వేల వరకు నష్టపోయా. అధికారులు స్పందించి తరుగు తీయకుండా చూడాలి.

    Paddy centers | లారీకి 15 సంచులు కట్ చేశారు..

    – పిట్ల గంగారాం, రైతు అయ్య పల్లి, లింగంపేట

    లారీకి 15 సంచులు తరుగు పేరుతో మిల్లర్ కట్ చేశారు. ఐకేపీ సీసీతో మాట్లాడితే తొమ్మిది సంచులకు డీల్ చేశారు. లారీ డ్రైవర్ కు సంచికి రూపాయి, తాడు గుంజే వ్యక్తికి సంచికి మరో రూపాయి చొప్పున రైతులు చెల్లించి ధాన్యం తరలిస్తున్నారు. దోపిడి అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

    Paddy centers | రూ.60 వేల వరకు నష్టం..

    – అంజయ్య, రైతు మాగి

    కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్తే 1,400 బస్తాలు అయ్యాయి. తరుగు పేరిట రైస్​ మిల్లర్లు క్వింటాలుకు 3 కిలోల చొప్పున కోత విధించారు. దీంతో సుమారు రూ.60 వేల వరకు నష్టపోతున్నాను. అసలే అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తుంటే రైస్​మిల్లర్లు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సంధించి చర్యలు తీసుకోవాలి

    Latest articles

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...

    More like this

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...