అక్షరటుడే, వెబ్డెస్క్ :Licenced Surveyors | రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ survey land records విభాగానికి సాయపడేందుకు రాష్ట్రంలో దాదాపు 5వేల మంది లైసెన్స్ కలిగిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం(Telangana Government) యోచిస్తోంది.
అర్హత కలిగిన సర్వేయర్లు(licensed Surveyors) మీసేవా కేంద్రాల్లో meeseva centres దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 5 నుంచి 17వరకు రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. ఇంటర్ గణితంలో 60శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్స్మన్(సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్(సివిల్) లేదా సమానమైన అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎంపిక చేయబడిన సర్వేయర్లకు ఈనెల 26 నుంచి జూలై 26 వరకు 50 పనిదినాల్లో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. ఆసక్తి అర్హత కలిగిన వారు మీసేవ కేంద్రాల ద్వారా ఈనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్(Collector) సూచించారు.