అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jaipur | భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళా దేశంలోని పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వస్తుండటం కలకలం రేపుతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో Sawai Mansingh Stadium బాంబు పెట్టినట్లు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నెల 16సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. బాంబు బెదిరింపుతో జైపూర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు. స్టేడియం లోపల, వెలుపల బాంబు స్వ్కాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
