అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ‘ఆపరేషన్ సింధూర్’, సరిహద్దుల్లో ఉద్రిక్తతపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సమావేశానికి కేంద్ర మంత్రులతో (Union ministers) పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే (Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge), వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah), రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh) అధ్యక్షతన సమావేశం జరిగింది. సుమారు గంటన్నర పాటు సమావేశం సాగింది. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సింధూర్’, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అఖిల పక్ష నేతలకు వివరించారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Union Minister Kiren Rijiju) కేంద్రం నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయని తెలిపారు. భారత సైన్యాన్ని (Indian Army) ప్రశంసించాయని చెప్పారు.
రాహుల్ గాంధీ rahul gandhi మాట్లాడుతూ.. కేంద్రం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇచ్చామని పేర్కొన్నారు. మల్లిఖార్జున ఖర్గే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు. భద్రతా పరమైన అంశాల దృష్ట్యా సమావేశంలోని విషయాలను బయటకు చెప్పలేమని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) స్పందిస్తూ దేశంలో సౌదీ, ఇరాన్ మంత్రులు (Saudi and Iran ministers visiting the country) పర్యటిస్తున్నారని.. వారికి ప్రస్తుత పరిస్థితులను వివరించాలని చెప్పారు.