అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ మహానగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓవైపు ఆపరేషన్ సిందూర్(Operation Sindoor), మరోవైపు మిస్ వరల్డ్ పోటీల (Miss World competitions) నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో భారీగా భద్రతను పెంచారు.
అంతేకాకుండా హైదరాబాద్లోని రక్షణ రంగ సంస్థల వద్ద నిఘాను రెట్టింపు చేశారు. అలాగే మిస్ వరల్డ్ పోటీల కోసం విదేశాల నుంచి అతిథులు హైదరాబాద్కు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center hyderabad) నుంచి మానిటరింగ్ చేస్తున్నారు.