అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi |ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Modi) గురువారం తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval) భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత పరిస్థితులపై వారు చర్చించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పుల పరిస్థితిపై మోదీ సమీక్షించారు. సరిహద్దుల్లో ఏం జరుగుతుందో మోదీ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) అధ్యక్షతన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం(Central Government) వివరించనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశానికి చేరుకున్నారు.
