ePaper
More
    HomeసినిమాMahesh Babu | సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేకి రాజ‌మౌళి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ సిద్ధం చేశారా

    Mahesh Babu | సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేకి రాజ‌మౌళి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ సిద్ధం చేశారా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mahesh Babu |ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మ‌హేష్ బాబు-రాజమౌళి(Mahesh Babu-Rajamouli) ప్రాజెక్ట్ ఒక‌టి. ఆర్ఆర్ఆర్(RRR) చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికే మూవీ షూటింగ్ ప్రారంభం కాగా, ఒడిశాలో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంది. రెండో షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత చిత్ర బృందం విదేశాల‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి డీటైల్స్ చెబుతాడని అంద‌రు అనుకున్నారు. కానీ SSMB 29 సినిమాకు అప్​డేట్​ ఏమీ చెప్పకుండానే విదేశాల‌కు వెళ్ల‌బోతున్నాడు.

    Mahesh Babu | ఆ డేట్ కోస‌మే..

    అయితే SSMB 29 చిత్ర అప్‌డేట్ గురించి ఫ్యాన్స్(Mahesh Babu Fans) ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంత వ‌ర‌కు ఏం రాలేదు, కానీ అంద‌రు కూడా ఆ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు కార‌ణం సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే(Superstar Krishna Birthday) నాడు మహేష్ చేస్తున్న సినిమా అప్​డేట్​ ఇస్తూ ఉంటాడు. మే 31న కృష్ణ Krishna జ‌యంతి కాగా, ఆ రోజు ఏదైనా స్పెషల్ అప్​డేట్​ వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సినిమా నుంచి టీజర్ వదులుతారా లేదా పోస్టర్ ఇస్తారా, లేక గ్లింప్స్ వ‌స్తుందా అన్నది చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వివరాలు చెప్పట్లేదు. అసలు రాజమౌళి ప్లాన్ ఏంటన్నది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సినిమా మీద బోలెడ‌న్ని అంచ‌నాలు పెట్టుకున్నారు.

    మహేష్ రాజమౌళి ఈ కాంబో మొదటిసారి సెట్స్ మీదకు వెళ్ల‌డంతో ఈ సినిమా గురించి ఒక్కొక్క‌రు ఒక్కో ఆలోచ‌న చేస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా ఈ ఇద్దరి కెరీర్ బెస్ట్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ నిలిచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహేష్ అయితే మొదటిసారి తెలుగు పరిశ్రమ దాటి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ (Pan world) లాంటి సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకునే అవ‌కాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్(Super star mahesh babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా ఎలా ఉండాలని ఫ్యాన్స్ అనుకుంటారో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను ఉండేలా చేయాలని చిత్రయూనిట్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ ఉంటుంద‌ని టాక్.

    Latest articles

    Schools Holidays | ఈ జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు.. హైదరాబాద్​లో పరిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Schools Holidays : భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ...

    Janahita Padayatra | 24 నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్ర.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Janahita Padayatra : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar...

    CM Revanth | ఆ ఆలయాలకు మహర్దశ.. టెంపుల్స్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy)...

    YS Jagan | జడ్పీటీసీ ఉప ఎన్నికల హైజాక్​.. ఏపీలో అరాచక పాలన : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్

    అక్షరటుడే, అమరావతి : YS Jagan | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ...

    More like this